Home  »  TV News  »  Illu illalu pillalu:  నర్మద గట్టి వార్నింగ్.. భద్రావతి ప్రతీకార జ్వాల!

Updated : Jun 13, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 496 లో శ్రీవల్లి, సుకన్య, భాగ్యం, ఆనందరావు నలుగురు కలిసి భాగ్యం వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటారు. ఆ ధీరజ్ వచ్చి నా ఆశలన్నీ నీరుకార్చాడని డిస్సప్పాయింట్ అవుతుంది శ్రీవల్లి. మేము వెళ్ళి చెడగొట్టాలని చూశాము కానీ వాడిని ఆ నర్మద, ప్రేమ పట్టేసుకున్నారని ఆనందరావు టంగ్ స్లిప్ అవుతాడు. అసలు మీరెందుకు వెళ్ళారని వాళ్ళని వల్లి తిడుతుంది. ఇందులో కూడా మనకి  ఏదో మంచి జరుగుతుందని అనిపిస్తుందని నా సిక్త్ సెన్స్ చెప్తుందని సుకన్య అనగానే అసలు నీకు సెన్స్ ఉందా అని వల్లి తిడుతుంది. అప్పుడే చందు వస్తాడు. వినేశాడేమో అని అందరు కంగారుపడతారు కానీ అతను వినడు. మీకు కొంపలు కూల్చడమే తెలుసనుకున్నాను కానీ  ఆ రౌడీని పట్టుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేశారని తెలిసిందని చందు అనగానే అవునని ఆనందరావు, భాగ్యం అంటారు. మార్పు మంచిదే కదా.. ఎవరైనా ఎప్పుడైనా మారాల్సిందే కదా.. వీళ్ళు ఇప్పుడు మారారు అని సుకన్య కవర్ చేస్తుంది.

ఇక ఆ ఛేజింగ్ లో అమ్మకి చేయి వంకరపోయింది, నాన్న కి కాలు వంకరపోయిందని వల్లి, సుకన్య యాక్ట్ చేస్తారు. అది నమ్మేస్తాడు చందు. రైస్ మిల్ కి వచ్చే అవకాశం ఇవ్వు అల్లుడు అని భాగ్యం, ఆనందరావు రిక్వెస్ట్ చేస్తారు. సుకన్య , వల్లి కూడా రిక్వెస్ట్ చేయడంతో వచ్చి బుద్ధిగా వర్క్ చేసుకో లేదంటే అని చందు అనబోతుండగా మీకు ఆ అవకాశం ఇవ్వను అల్లుడు అని ఆనందరావు అంటాడు. ఆ తర్వాత చందు వెళ్ళిపోతాడు. ఇక సుకన్య, వల్లి, భాగ్యం, ఆనందరావు డ్యాన్స్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది. మామయ్య రైస్ మిల్ కి రావడానికి ఏదో కారణం ఉందని అనిపిస్తుంది అది తెలియాలి మీకు మాములుగా ఉండదు.‌ ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నాయని మీకు గ్యాప్ ఇచ్చాను కానీ మా కళ్ళు ఎప్పుడూ మీ పైనే ఉంటాయని నర్మద వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది. మరోవైపు భద్రవతి కోపంతో ఇంట్లోని వస్తువులను పడేస్తూ ధీరజ్ ని తిడుతుంది. వాడు అంతలా రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం ప్రేమే అని సేనాపతి అంటాడు. ఇక ఆ ధీరజ్ గాడికి గట్టి గుణపాఠం చెప్పాలని ఇద్దరు అనుకుంటారు.

మరోవైపు ధీరజ్ కి తగిలిన గాయాలకి కాపడం పెట్టడానికి క్లాత్ వాటర్ తీసుకుని వస్తుంది ప్రేమ.‌ఇక అదే సమయంలో ప్రేమ చేతికి అయిన గాయం చూసి ఆంటిమెంట్ తీసి రాస్తాడు ధీరజ్. ఇక ఇద్దరు ప్రేమగా చూసుకుంటారు. అప్పుడే నర్మద వస్తుంది. ఇక ప్రేమ చేసిందంతా చెప్తుంది నర్మద. నా కోసం ఇదంతా చేశావా అని ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్. మరుసటి రోజు చందు మిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే శ్రీవల్లి ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. టైమ్ కి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగుతాడు చందు. ఏంటి బావ ఆగావు అని వల్లి అడుగగా మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉందని చందు అనగానే వల్లి టెన్షన్ పడుతుంది. అప్పుడే సుకన్య, గుమ్మం దగ్గర నర్మద, ప్రేమ వస్తారు. కడుపులో బిడ్డ హార్ట్ బీట్ వినాలని చందు బావ అనుకుంటే వల్లి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందని ప్రేమ, నర్మద అనుకుంటారు. మరోవైపు ఇప్పుడు ఎందుకు బావ అని వల్లి అంటుంది. అదేంటి నువ్వు హ్యాపీగా ఒప్పుకుంటావని అనుకుంటుంటే ఎందుకు అంటావేంటని చందు అంటాడు. ఇక చేసేదేమీ లేక సరే అంటుంది వల్లి. ఇక శ్రీవల్లి కడపు దగ్గర తల వాల్చుతాడు చందు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.